ఉగాది పర్వదినం (ugadi festival) రోజున తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Telangana IT Minister KT Rama Rao), తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ (BJP Telangana president Bandi Sanjay) మధ్య ట్విట్టర్ యుద్ధం (Twitter fight) సాగింది.
ఉగాది పర్వదినం (ugadi festival) రోజున తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Telangana IT Minister KT Rama Rao), తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ (BJP Telangana president Bandi Sanjay) మధ్య ట్విట్టర్ యుద్ధం (Twitter fight) సాగింది. పండుగ రోజున కేటీఆర్ పొలిటికల్ పంచాంగం (political Panchangam) పేరుతో బీజేపీ (BJP) పైన సెటైర్ వేయగా, సంజయ్ (Bandi Sanjay) ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఇది నెటిజన్లను బాగా ఆకర్షించింది. తనకు వచ్చిన దానిని ఫార్వార్డ్ చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. బండి సంజయ్ కూడా కౌంటర్ ఇస్తూ, ఇది కూడా తనకు వచ్చిందే ఫార్వార్డ్ చేస్తున్నట్లు తెలిపారు. నిన్న సాయంత్రం వీరి మధ్య జరిగిన ట్విట్టర్ యుద్ధం పైన నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందించారు.
ఉగాది పర్వదినం రోజున పంచాగం (Ugadi Panchangam) చెప్పించుకోవడం తెలిసిందే. దీంతో కేటీఆర్ శోభకృత్ నామ సంవత్సరంలో (shubhakruth nama samvatsara) దేశంలోని పరిస్థితి ఇలా ఉంటుందనే అభిప్రాయంతో ట్వీట్ చేస్తూ… ఆదాయం.. అదానీకి (Adani), వ్యయం.. జనానికి, బ్యాంకులకు, అవమానం… నెహ్రూకి, రాజపూజ్యం గుజరాతీ గుంపుకు, బస్, బభ్రజీమానం భజగోవిందం.. దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం అని పేర్కొన్నారు.
ఈ ట్వీట్ పైన బండి సంజయ్ (Bandi Sanjay) అంతే ధీటుగా గట్టి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ కు. తెలంగాణలో (Telangana) ఆదాయం.. కల్వకుంట్ల కుటుంబానికి (Kalvakuntla Family), వ్యయం… తెలంగాణ రాష్ట్రానికి, అవమానం… ఉద్యమవీరులకు, అమరుల త్యాగాలకు, రాజపూజ్యం… ఉద్యమ ద్రోహులకు, దొంగలకు, తుస్… పిట్టల దొర, తుపాకీ చంద్రుల గడీల పంచాయతీ లెక్క తేలుడే తరువాయి… పతనం ఇగ షురువాయే అని ట్వీట్ చేశారు. కేటీఆర్ కు బండి సంజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తదితరులు తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.