ఇద్దరం కలిసి మల్కాజ్గిరిలో పోటీ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. గ్రామాల్లో రైతులు కాంగ్రెస్ను తిట్టుకుంటున్నారని, ఆయనకు నరుకుడు.. ఉరుకుడు తప్ప ఏది చేతకాదని ఎద్దేవా చేశారు.
KTR: ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి సవాలు విసిరాడు. దమ్ముంటే మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేయడానికి రావాలని అన్నారు. దమ్ముంటే ఒక్క సీటైనా గెలవమని బీఆర్ఎస్(BRS) పార్టీకి సవాల్ విసరుతున్నారని, అందుకే ఆయన సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిలోనే పోటీ చేద్దామని ఇదివరకే చెప్పానని అన్నారు. సవాల్ స్వీకరించడు కానీ మైక్ దొరికితే దచ్చుతడు అని విమర్శించారు. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని.. దమ్ముంటే సవాల్ స్వీకరించాలని.. పోటీ పడదామన్నారు. ఆయనకు నరుకుడు.. ఉరుకుడు తప్ప ఏదీ చేతకాదని ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులు కాంగ్రెస్ను తిట్టుకుంటున్నారని అన్నారు.
ఈ ప్రభుత్వం అధికారంలోకిి వచ్చాక ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని పేర్కొన్నారు. అసలు రేవంత్ రెడ్డి… మోదీ మనిషా? లేక రాహుల్ గాంధీ మనిషా? అర్థం కావడం లేదని విమర్శించాారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు. అలాగే ఈటల రాజేందర్ గురించి మాట్లాడారు. ఆయన మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దని అన్నారు. కేసీఆర్కు వెన్నుపోటు పొడిచిన నాయకులే ఇక్కడ పోటీ చేస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావించారు. 10 లక్షల మంది ఫోన్లను ట్యాపింగ్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి అవాస్తవం చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దమ్ముంటే విచారణ జరిపించుకోవాలని సవాల్ చేశారు.