»Khairatabad Ganesh Idol Works Started With Karra Pooja This Year Height 61 Feet
Khairatabad మహాగణపతి నిర్మాణానికి అంకురార్పణ.. ఈసారి ఎన్ని అడుగులంటే..?
నిర్జల ఏకాదశిని పురస్కరించుకుని మే 31వ తేదీ బుధవారం కర్రపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతేడాది మట్టితో 50 అడుగుల నిర్మాణం చేయగా.. ఈసారి ఏకంగా ఎత్తైన విగ్రహం నిర్మిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద వినాయక విగ్రహాన్ని ఏర్పాటయ్యేది తెలంగాణలోనే (Telangana). అసలు ముంబై తర్వాత గణేశ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేది హైదరాబాద్ (Hyderabad)లోనే. అలాంటి ఉత్సవాలకు మరింత వన్నె తీసుకొచ్చేది ఖైరతాబాద్ గణేశ్ (Khairatabad Ganesh Idol). ప్రతి యేటా మాదిరే ఈ ఏడాది కూడా వినాయక ఉత్సవాలు (Ganesh Utsav) అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. అయితే ప్రతిసారి ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ఎత్తు (Height) ఎంత? ఏ ఆకారంలో కనిపిస్తుంది అని తెలుసుకునేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తుంటారు. ఎట్టకేలకు మహా గణపతి విగ్రహా నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఎన్ని అడుగులు.. ఏ రూపంలో ఉంటాడో తెలుసుకోండి.
తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలోనే అతి పెద్ద వినాయక విగ్రహం కొలువుదీరేదీ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ లోనే. ఆ మహా గణపతి విగ్రహ (Idol) నిర్మాణ పనులు ప్రారంభమయ్యారు. నిర్జల ఏకాదశిని పురస్కరించుకుని మే 31వ తేదీ బుధవారం కర్రపూజ (Karra Pooja) నిర్వహించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతేడాది మట్టితో 50 అడుగుల నిర్మాణం చేయగా.. ఈసారి ఏకంగా 61 అడుగుల ఎత్తైన విగ్రహం నిర్మిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. వారం రోజుల్లో గణేశ్ రూపాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించింది. కాగా, ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ ఆకస్మిక మరణంతో తొలిసారి ఆయన లేకుండా గణేశ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
కాగా, ప్రతియేటా వినాయక విగ్రహ నిర్మాణంలో ప్రత్యేకత చాటుకుంటున్నారు. గతేడాది మట్టి వినాయకుడిని రూపొందించినట్టే ఈసారి కూడా మట్టి విగ్రహమే నిర్మించనున్నారు. అనంతరం సహజ రంగులు (Natural Colours) వాడనున్నారు. ఖైరతాబాద్ గణేశ్ విగ్రహంపై న్యాయస్థానాల్లో (High Court) పలు కేసులు ఉన్నాయి. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్సవాలు సాఫీగా జరిగేలా ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా కమిటీ విజ్ణప్తి చేసింది.