తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా… ఆ మందుస్తు ఎన్నికల విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు తేల్చారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో… ఆయన ముందస్తు ఎన్నికలు జరగవని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు అని తేల్చి చెప్పారు.
ఈ టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అత్యవసరంగా ఏర్పాటు చేస్తున్నారు అని తెలియగానే ముందస్తు ఊహగానాలు పెద్ద ఎత్తున తెర మీదకు వచ్చాయి. అయితే ఆ ఊహగానాలకు కేసీఆర్ ఇప్పుడు తెరదించారు. ఇక ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదన్న ఆయన మళ్లీ పాత వాళ్ళకే టికెట్స్ ఇస్తున్నామని అన్నారు. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జిను నియమిస్తామని కూడా కేసీఅర్ పేర్కొన్నారు.
ఇక మంత్రులు యాక్టివ్ గా ఉండాలని అసలు …ఎందుకు ప్రభుత్వ స్కీమ్ ల గురించి విస్తృతంగా మాట్లాడడం లేదు అని మంత్రులను కేసీఅర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని మంత్రులకు సూచించిన కేసీఆర్, నాతో కలిసి పోరాటానికి సిద్ధమా అని సమావేశంలో నేతలను ఉత్సాహ పరిచారు. ఈ క్రమంలో పోరాటానికి తాము సిద్ధమే అని చేతులెత్తి సంఘీభావం తెలిపారు.
ఈ సమయంలోనే కేంద్రానికి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి ….మనకు దర్యాప్తు సంస్థలు ఉన్నాయి.. వాళ్లో మనమో. తేల్చుకుందామని కేసీఅర్ అన్నారు. అన్నింటికీ సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించిన కెసిఆర్ ఈ సమావేశంలో ఆంధ్రా సీఎం జగన్ గురించి కూడా ప్రస్తావించారు. కేంద్రానికి అనుకూలంగా జగన్ ఉన్నా… అతన్ని దెబ్బతీసేందుకు బిజెపి కుట్ర చేసింది అని ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. సమావేశం వివరాలు ఎక్కడ బయటకు చెప్పొద్దు అని నేతలకు కేసీఆర్ స్పష్టం చేయడమే కాక మీ ఫోన్ల పై నిఘా ఉంటుందని కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది.