Prabhas: తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయని ప్రభాస్… కారణం ఇదే..!
తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయడానికి చాలా మంది టాలీవుడ్ స్టార్స్ ముందుకు వచ్చారు. తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఓటు హక్కును వినియోగించుకోలేకపోయాడు.
తెలంగాణ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్, రాజమౌళి, రానా, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, నాని, నితిన్ వంటి స్టార్లు తమ ఓటు వేశారు. అయితే ప్రభాస్ ఓటు వేయడానికి రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతని పోలింగ్ బూత్ మణికొండ. అభిమానులు, ప్రేక్షకులు ప్రభాస్ ఓటు వేయడానికి వస్తారని ఊహించారు. అయితే ప్రభాస్ కనిపించకపోవడంతో వారు నిరాశ చెందారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిన్న ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఓటు వేయడానికి తరలివచ్చారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఓటు వేసేందుకు తరలివచ్చారు. అయితే ప్రభాస్ తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సలార్’ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. కొన్నాళ్ల క్రితం విదేశాల్లో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న ప్రభాస్ ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చాడు. బహుశా కాలి నొప్పి కారణంగానే ప్రభాస్ ఓటు వేయడానికి రాలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.