తెలంగాణ పోలీసులపై సీపీఐ (ఎంఎల్) జనశక్తి నేత కూర రాజన్న (Kura rajanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఆశ్రయం ఇచ్చిన వారిపై పోలీసులు (Police) అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని ఆయన ఆరోపించారు. తాను కూడా ఉద్యమకారుడి పాత్ర పోషించానని ఆయన అన్నారు. తనకు ఇక్కడ ఇల్లు లేదని చెప్పారు. తన ఆరోగ్యం బాగా లేదని , ఇటువంటి సమయంలో ఒక స్నేహితుడు తనకు సాయం చేసినందుకు అతనిపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. తాను వేములవాడ (Vemulawada) సత్రంలో ఉంటున్నందుకు తనను పొలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. పొలీసులు అక్రమ కేసులు పెడితే తాను ఊరుకోనని హెచ్చారించారు.పోలీసులు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరిస్తే మళ్ళీ తాను నక్సలిజాన్ని (Naksalija)తయారు చేస్తానని కూర రాజన్న తెలిపారు. ఇద్దరు పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు
పోలీసులు మళ్ళీ తనను అడివిలోకి వెళ్లే విదంగా చేస్తున్నారన్న రాజన్న… అవసరం పడితే వారం రోజుల్లో జనశక్తి(Janashakti)ని రీఆర్గనైజేషన్ చేస్తానని తెలిపారు. సమాజంలో తనకు మాట్లాడే, తిరిగే హక్కు లేదా అని ప్రశ్నించారు కూర రాజన్న. ప్రశ్నించే వారిని పోలీసులు జైల్లో పెడుతున్నారని, తాము అన్నింటికీ సిద్ధమయ్యే వచ్చామని చెప్పారు. నక్సలైట్ అంటే నేరస్థుడా..? హంతకుడా..? ఆది కూడా ప్రజల కోసం ఏర్పడిన పార్టేనే అన్నారు, పాలకులు ద్రోహులు, దొంగలని, అసెంబ్లీ (Assembly) అనేది ఒక దొంగలకు అడ్డానని అన్నారు. నాలుగు రూపాయల కోసం మీరు డ్యూటీ చేస్తున్నారని పోలీసులను ఆయన ప్రశ్నించారు.పోలీసులు రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తున్నారని, ఇలాంటి దుర్మార్గం లాంటి పనులు మానుకోవాలని రాజన్న సూచించారు.