»Imagine What It Will Be Like If Kcr Comes To The Assembly Ktr
KTR: కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి అని కేటీఆర్ అన్నారు. సీఎం అనే రెండక్షరాల కంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అని పేర్కొన్నారు.
Imagine what it will be like if KCR comes to the assembly KTR
KTR: కేసీఆర్(KCR) అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. సీఎం అనే రెండక్షరాల కంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. నేడు బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. మనమంతా తెలంగాణ ఉద్యమం సమయంలో గట్టిగా పోరాడమని మరోక్కసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆ పటిమను చూపించాలన్నారు.
ఇక ముందుముందు కేసీఆర్ సభకు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అన్నారు. కేసీఆర్ ఫిబ్రవరిలో ప్రజల మధ్యకు వస్తున్నారని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ముందు ప్రతి మూడు నెలలకోసారి సమావేశాలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు.