Hyderabad: మాదాపుర్‌లో లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్‌లోని మాదాపుర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన శ్యామ్‌బాబు, కాటూరి సూర్యకుమార్‌ల దగ్గర రూ.4.2 లక్షల విలువ చేసే ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad: హైదరాబాద్‌లోని మాదాపుర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన శ్యామ్‌బాబు, కాటూరి సూర్యకుమార్‌ల దగ్గర రూ.4.2 లక్షల విలువ చేసే ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ల దగ్గర 28 గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సూర్యకుమార్, గుత్తలశ్యామ్లు చిన్ననాటి మిత్రులు. ఉన్నత చదువులకు బెంగళూరు వెళ్లి చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. అలా డ్రగ్స్ సరఫరా చేయడం మొదలుపెట్టడాు.
బెంగళూరులోని కీలక నిందితుడు సోల్మెన్ నుంచి డ్రగ్స్ తీసుకుని.. రాజమహేంద్రవరంలో విద్యార్థులకు అధిక ధరకు విక్రయిస్తున్నాడు. ఎలక్షన్ల కారణంగా దేశవ్యాప్తంగా పోలీసులు అన్ని ప్రధానమైన రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో డ్రగ్స్ రవాణా కష్టంగా మారింది. ఇలా డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చనే ఆశతో వాళ్లు డ్రగ్స్‌ను సరఫరా చేయగా పోలీసులకు దొరికారు. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.