»Harish Rao Cms Post For Revanth Is Alms Given By Kcr
Harish Rao: రేవంత్‌కు సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష
రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. పదవితో బాధ్యత పెరగాలి. కానీ ఆ పదవిని కించపరిచేలా రేవంత్ వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.
Harish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. పదవితో బాధ్యత పెరగాలి. కానీ ఆ పదవిని కించపరిచేలా రేవంత్ వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. పాలు ఏవో, నీళ్లు ఏవో ప్రజలకు ఇప్పటికే అర్థమైందని హరీశ్‌రావు అన్నారు. బడ్జెట్ లేదని తెలిసినా కాంగ్రెస్ ప్రజలను ఆశపెట్టి మోసం చేసిందన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 8 నెలలు దాటినా ఆ హామీలను అమలు చేయలేదన్నారు.
ఆరు నెలలు దాటితో ఇక్కడ స్థానిక ఎన్నికలు వస్తాయని.. అప్పుడు ప్రజలు మనల్ని వెతుక్కుని ఓటు వేస్తారన్నారు. ఉచిత కరెంట్ రావడం లేదు. మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. కరెంట్ మోటర్లను రిపేర్ చేసే వ్యాపారం పెరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసమర్థత కనిపిస్తున్నాయి. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతుంటే అసహనంతో దాడులు చేస్తూ.. బెదిరిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు.