తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే వివిధ జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరికొన్ని ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆర్దిక మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా ద్వారా ఇందుకు సంబందించిన వివరాల్ని పోస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీ కానున్నట్లు హరీష్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల్ని సీఎం కేసీఆర్ నిలబెట్టుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 10 ప్రిన్సిపల్ పోస్టులు, 480 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, 185 జూనియర్ లెక్చరర్ పోస్టులు, 235 పీజీటీ పోస్టులు, 324 టీజీటీ పోస్టులను భర్తీ ప్రభుత్వం చేయనుంది.