ఉదయం టిఫిన్ (Tiffin) అంటే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది ఇడ్లీ. దోశ, బజ్జీ, ఉప్మా, పూరీ ఇలా ఎన్ని ఉన్నా.. ఇడ్లీకి ఉండే ప్రత్యేకతే వేరు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే దీన్ని కడుపు నిండా ఆరగించవచ్చు.కాని ఓ హోటల్లో బంగారం దొరుకుతుంది.హైదరాబాద్ (Hyderabad) అంటే ఫేమస్ బిర్యానీ, హలీమ్.. ఇలా ఎన్నో ప్రత్యేకమైన వంటకాలు గుర్తొస్తాయి. అయితే, హైదరాబాద్ ఫేమస్ డిషెస్‌లో కొత్త రకం వంటకం యాడ్ అయింది. అది గోల్డ్ ఇడ్లీ (Gold Idli).. బంజారాహిల్స్‌లో కృష్ణ ఇడ్లీ కేఫ్(Krishna Idli Cafe) బంగారు ఇడ్లీ దొరుకుతుంది. దీని ధర రూ. 1200. బంగారు పూత పూసిన ఈ ఇడ్లీని గులాబీ రేకులతో కలర్‌ఫుల్ గార్నిష్ చేసి సర్వ్ చేస్తారు