»Ghmc Commissioner Ronald Rose Said That A Special Campaign Will Be Held On September 2 And 3 For Voters
GHMC: సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఓటు హక్కు క్యాంపెయిన్..వినియోగించుకోండి
మీరు ఇంకా ఓటు హక్కు తీసుకోలేదా లేదా ఏదైనా మీ ఓటులో ఏదైనా మార్పులు చేయాలని చూస్తున్నారా? అయితే ఈ న్యూస్ మీ కోసమే. అర్హులైన వారందరూ ఓటు నమోదు చేసుకోవడంతోపాటు మార్పుల కోసం సెప్టెంబర్ 2,3 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు.
GHMC Commissioner Ronald Rose said that a special campaign will be held on September 2 and 3 for voters.
GHMC: హైదరాబాద్(Hyderabad) జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్(Commissioner) రోనాల్డ్ రోస్( Ronald Rose ) బుధవారం ఓటు హక్కు నమోదు, చెకింగ్ కోసం కీలక ప్రకటన చేశారు. రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా అర్హులైన వారందరూ వారి ఓటు హక్కు కోసం సెప్టెంబర్ 2,3 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్( special campaign) నిర్వహించనున్నట్లు చెప్పారు. అయితే ఓటు హక్కు పొందాలనుకునేవారికి తప్పనిసరిగా 18 ఏండ్లు నిండి ఉండాలి. ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు లేని వారితో పాటు అక్టోబర్ 1, 2023 నాటికి 18 ఏండ్లు నిండబోయే వారు ముందస్తుగా నమోదు చేసుకోవచ్చని కూడా చెప్పారు.
ఆగస్టు 21న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశారు. అందులో పేరు ఉందో లేదో ముందుగా పరిశీలన చేసుకోవాలని, పేరులో ఏదైనా తప్పులు ఉంటే సవరించుకునే అవకాశం ఉందన్నారు. స్పెషల్ క్యాంపెయిన్ సందర్భంగా బూత్ లెవెల్ అధికారి పోలింగ్ స్టేషన్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. ఓటరు జాబితాలో చెక్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ceotelangana.nic.in కూడా అందుబాటులో ఉంటుందన్నారు. కొత్త ఓటరు నమోదుకు ఫారం-6, ఆధార్‌ను లింక్ చేయడానికి ఫారం 6బీ, ఓటరు జాబితా అభ్యంతరాలు, ఓటరు తొలగింపునకు ఫారం-7, మార్పులు చేర్పులకు ఫారం-8 ద్వారా సెప్టెంబర్ 19లోగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఈసీఐ వెబ్ సైట్ https://voters.eci.gov.in లేదా voter helpline app తమ ఓటు ఐడెంటి కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.