ములుగు ఎమ్మెల్యే సీతక్క (MLA Sitakka) హైకోర్టును ఆశ్రయించారు. నియోజకవర్గానికి సీడీఎఫ్ ఫండ్స్ రిలీజ్ చేయడం లేదని సీతక్క కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిధులు మంజురు విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని పిటిషన్లో పెర్కోన్నాది.కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నందున తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వట్లేదని సీతక్క ఆరోపించారు. సీడీఎఫ్ (CDF) మంజూరులో జిల్లా మంత్రి ప్రమేయం చట్ట విరుద్ధమని సీతక్క తన పిటిషన్(Petition)లో పేర్కొన్నారు. జిల్లా మంత్రి ఆమోదంతో నిధులు మంజూరు చేయాలన్న జీవో కొట్టేయాలని పిటిషన్లో సీతక్క కోరారు.
వెంటనే నిధులు విడుదలకు ఆదేశించాలని న్యాయవాది కృష్ణ కుమార్ గౌడ్ కోరారు. ఎమ్మెల్యే సీతక్క వేసిన పిటిషన్ పై ప్రభుత్వానికి హై కోర్టు (High Court) నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 9కి హైకోర్టు వాయిదా వేసింది. ములుగు జిల్లాలో మంత్రి హరీష్ రావు (Harish Rao) పర్యటన వేళ పోలీసుల తీరుపై ఎమ్మెల్యే సీతక్క తీవ్ర స్థాయిలో ఫైర్య్యారు. మంత్రి ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ్రాయి గ్రామం(Kondrai village)లో ఇళ్లు కోల్పోయిన మహిళలను పోలీసు స్టేషన్లో ఉంచడంపై.. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన సీతక్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇండ్లు కోల్పోయిన బాధితులు మంత్రిని కలిసేందుకు వస్తే ఎలా అని ప్రశ్నించారు. మనం ప్రజాస్వామ్యం
(Democracy)లో ఉన్నామా? పాకిస్తాన్లో ఉన్నామా?’’ అని సీతక్క ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్తలను, ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్లు చేశారని అన్నారు. మంత్రి వస్తున్నప్పుడు వినతిపత్రం కూడా అందజేసే స్వేచ్ఛ లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. మంత్రి పాల్గొంటున్న మీటింగ్ (Meeting) ప్రజాధనంతో పెడుతున్నారని.. కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అయితే పార్టీ మీటింగ్ అయితే తాము పట్టించుకునే వాళ్లం కాదని.. అది ప్రజల సొమ్ముతో పెడుతున్న మీటింగ్ అని అన్నారు