Man Arrested For Teen's Rape Near Ujjain, Tried To Escape From Custody
Ujjain: మధ్యప్రదేశ్లో గల ఉజ్జయిని సమీపంలో ఓ మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. అరెస్టు అయిన నిందితుడు కస్టడీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. లైంగికదాడి కేసులో పూర్తి వివరాలు సేకరించేందుకు పోలీసులు నిందితుడిని ఘటన జరిగిన ప్రదేశానికి తీసుకువెళ్లారు. అదనుగా భావించిన నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అప్రమత్తమై పట్టుకున్నారు. ఈ కేసులో సాక్ష్యాలు సేకరిస్తున్నామని.. సీసీటీవీని పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు.
నిందితుడు ఉజ్జయినిలో ఉంటాడని, బాలిక ఒంటరిగా ఉండటాన్ని చూసి, అఘాయత్యానికి పాల్పడ్డాడనని పోలీసులు చెప్పారు. ఘటనకు సంబంధించి బాలిక స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చిన సమయంలో తల్లిదండ్రుల మీద ఉన్న కోపంతో సాత్నాను వదిలి.. మంచి జీవితాన్ని వెతుక్కుంటూ ఉజ్జయిని వచ్చానని తెలిపింది. సోమవారం రిక్షా పుల్లర్ తనపై అత్యాచారం చేశాడని అత్యాచార బాధితురాలు చెప్పిందని పోలీసులు తెలిపారు.
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఆటో రిక్షా డ్రైవర్ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ఐదుగురు అనుమానితులను విచారిస్తున్నారు. 12 ఏళ్ల అత్యాచార బాధిత బాలిక (మైనర్ బాలిక) రక్తస్రావంతో సహాయం కోసం పరుగెత్తుతున్న భయంకరమైన సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆటో రిక్షా డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. రిక్షా సీటుపై రక్తపు మరకలను గుర్తించారు. బాలికకు చికిత్స చేసి పరామర్శించగా.. సాత్నా జిల్లాకు చెందినదని తెలిసింది.
ఆకలిలో ఉండటం వల్ల సహాయం కోసం బాలిక వేడుకుంటూ ఉండగా, ఆశ్రమ పూజారి రాహుల్ శర్మ సాయం చేశాడు. పరిస్థితిని పోలీసులకు తెలిపాడు. ‘ఆశ్రమానికి వచ్చిన స్థితి వర్ణనాతీతం. అర్థ నగ్న స్థితిలో ఉంది. చాలా భయపడింది. ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ముందుగా బట్టలు ఇచ్చి.. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించాను. తినడానికి ఏదైనా కావాలా అని అడిగానని.. భోజనం అందజేశానని వివరించారు. భోజనం చేస్తున్న సమయంలో పోలీసులు వచ్చారని.. తన వెనుక ఉండిపోయిందని రాహుల్ తెలిపారు.