»Four Babies In One Delivery Mother And Baby Are Safe
Sirisilla District : ఒకే కాన్పులో నలుగురు శిశువులు.. తల్లీబిడ్డలు క్షేమం
ఒక కాన్పులో ఒక బిడ్డ జన్మించడం సహజం. అరుదుగా కొందరికి కవలలు జన్మిస్తుంటారు. కానీ, అత్యంత అరుదుగా కొందరు మహిళలు ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు బిడ్డలకు జన్మినిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి అత్యంత అరుదైన ఘటనే ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Sirisilla District) జరిగింది. ముస్తాబాద్‌లోని(Mustabad ) పీపుల్స్ హాస్పిటల్లో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది.
ఒక కాన్పులో ఒక బిడ్డ జన్మించడం సహజం. అరుదుగా కొందరికి కవలలు జన్మిస్తుంటారు. కానీ, అత్యంత అరుదుగా కొందరు మహిళలు ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు బిడ్డలకు జన్మినిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి అత్యంత అరుదైన ఘటనే ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Sirisilla District) జరిగింది. ముస్తాబాద్‌లోని(Mustabad ) పీపుల్స్ హాస్పిటల్లో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట (Gambhiraopet) మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్టెముక్కుల లావణ్య రెండో కాన్పు కోసం ముస్తాబాద్‌లోని పీపుల్స్ దవాఖానలో చేరింది.
ఆమెకు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు గర్భంలో నలుగురు శిశువులు ఉన్నట్లు గుర్తించి శస్త్రచికిత్స చేశారు. ముగ్గురు మగ శిశువులు, ఒక ఆడ శిశువు జన్మించారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, తల్లి గర్భంలో ఒకేసారి నాలుగు పిండాలు ఏర్పడటం అత్యంత అరుదని డాక్టర్ చింతోజి శంకర్ (Dr. Chintoji Shankar) తెలిపారు. డాక్టర్ తేజస్విన్, డాక్టర్ అఖిల, ఇతర వైద్య సిబ్బంది లావణ్యకు శస్త్రచికిత్స నిర్వహించడంలో పాల్గొన్నారని తెలిపారు. ఇదిలావుంటే లావణ్యకు (Lavanya)మొదటి కాన్పులో కొడుకు జన్మించాడు. ఇప్పడతనికి తొమ్మిదేళ్లు. ముగ్గురు మగ, ఒక ఆడ శిశువుకు లావణ్య జన్మనిచ్చిందని వైద్యులు చెప్పారు. నెలలో కనీసం ఒకసారి ముగ్గురు శిశువులు జన్మిస్తుంటారు. కాని ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించటం, వారంతా క్షేమంగా ఉండటం అరుదని డాక్టర్ శంకర్ తెలిపారు. గర్భోద్దారణ (Pregnancy) సమయంలో 4 చీలికలు ఏర్పడి అవి 4 పిండాలుగా అభివృద్ధి చెందుతాయని ఆయన తెలిపారు.