Bodige Galanna : చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భర్త బొడిగె గాలన్న నేడు కన్నుమూశారు. బొడిగె గాలన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాలన్న మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి బొడిగె గాలన్న పార్టీ కోసం పని చేశారన్నారు.
శంకరపట్నం జెడ్పీటీసీగా, చొప్పదండి ఎమ్మెల్యేగా పనిచేసిన తన సతీమణి శోభక్కతో కలిసి పనిచేశారని వినోద్ గుర్తు చేశారు. గాలన్న చిన్నతనం నుంచి పేదల సమస్యలపై పోరాడేవారని, వామపక్ష పార్టీల్లో పనిచేశారన్నారు. బొడిగె గాలన్న మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం సైదాపూర్ మండలం వెంకటేశ్వర్ల గ్రామానికి తరలించారు. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శోభక్క ఆ తర్వాత బీజేపీ పార్టీలో చేరారు. గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.