»Former Minister Harish Rao Reached Gun Park With Resignation Letter
Harish Rao: రాజీనామా పత్రంతో గన్ పార్క్ చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఎమ్మెల్యే హారీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు ఆగస్టు 15 లోపు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తే తన రాజీనామాను స్పీకర్‌కు పంపించండి అంటూ మీడియాకు లెటర్ ఇచ్చారు.
Harish Rao: సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తన రాజీనామా పత్రంతో గన్ పార్క్ వద్దకు వచ్చారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫి చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్లు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే తన రాజీనామా ఆమోదించాలని, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పారు. రైతు రుణమాఫి విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి హారీష్ రావు సవాల్ విసిరారు. దానికి ప్రతిసవాలుగా ముఖ్యమంత్రి స్పందించారు. రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకొని తిరుగు అని అన్నారు. దానిపై స్పందించిన హారీష్ రావు గన్ పార్క్ వద్ద తేల్చుకుందాం.. ఇద్దరం రాజీనామా పత్రాలను మేదావులకు ఇద్దామని దానికి రేవంత్ రెడ్డి సిద్ధమా అని అన్నారు.
అనడమే కాదు ఈ రోజు ముఖ్యనేతలతో పాటు తన రాజీనామా పత్రాన్ని తీసుకొని గన్ పార్క్ వద్దకు వచ్చారు. స్థూపానికి పూలతో నివాళు అర్పించారు. ఆయన రాజీనామా పత్రాన్ని స్థూపం ముందు ఉంచారు. ఎన్నికల కోడ్ కారణంగా 144 సెక్షన్‌ను దృష్టిలో పెట్టుకొని కేవలం 5 మంది మాత్రమే వచ్చావని మీడియాతో మాట్లాడారు. హరీష్ రావుకు తోడుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికిి ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చడంలో చిత్త శుద్ది లేదంటూ వ్యాఖ్యానించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే తన రాజీనామాను స్పీకర్‌కు పంపండి అంటూ మీడియా వాళ్లకు తన రాజీనామాను ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రాజీనామా పత్రంతో మరికాసేపట్లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు ఎమ్మెల్యే హరీష్ రావు
ఆగస్టు 15వ తేదిలోపు రైతు రుణమాఫీ, ఆరు హామీల అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన హామీ నేపథ్యంలో ప్రతి సవాల్ విసిరిన ఎమ్మెల్యే హరీష్ రావు. pic.twitter.com/1zqO3G7S7q