NRML: భైంసా వ్యవసాయ మార్కెట్లో గురువారం క్రయవిక్రయాలు జరగవని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తాత్కాలికంగా భూసార్ బీట్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు, కమీషన్ దారులు, ఖరీదుదారులు గమనించి సహకరించాలని కోరారు.