GDL: సీఐటీయూ అనుబంధంగా ఉన్న తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ యొక్క మూడవ జిల్లా మహాసభలు బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమ్యూనిటీ హాల్లో ప్రారంభమయ్యాయి. CITU జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి హమాలి వర్కర్లకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలన్నారు.