NZB: జిల్లాలో అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని USFI నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మాట్లాడుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించే ముందే సదరు విద్యాసంస్థలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో సరిచూసుకోవాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై అధికారులు నిఘా పెట్టాలన్నారు.