SRCL: వేములవాడ రాజన్న భక్తులందరూ సహకరించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాజన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. పట్టణ, ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సుమారు రూ.150 కోట్లతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.