»Father Carried His Daughter On His Shoulders To Inter Examination Centre
Studentని భుజాలపై పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లిన తండ్రి.. ఎక్కడంటే!
మెదక్‌కు (medak) చెందిన ఇంటర్ విద్యార్థిని శ్రీ వర్షకు (sri varsha) ఇటీవల కాలు విరిగింది. బుధవారం పరీక్షలు ప్రారంభం కావడంతో తండ్రి వెంకటేశంతో (venkatesham) కలిసి సెంటర్‌కు చేరుకుంది. గేటు నుంచి హాల్ (hall) వరకు చాలా దూరం ఉంది. కూతురు (daughter) నడవలేదని.. వీల్ చెయిర్ ఏర్పాటు చేయాలని సెంటర్ నిర్వాహకులను వెంకటేశం (venkatesham) కోరిన పట్టించుకోలేదు.
Father carried his daughter on his shoulders to inter examination centre
Student:తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు (Inter exams) నిన్నటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎగ్జామ్స్ (exams) సందర్భంగా కొందరు విద్యార్థులు (students) ఇబ్బంది పడుతున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్ (centre) చేరుకునేందుకు ప్రాబ్లమ్స్ తప్పడం లేదు. దానికితోడు ‘నిమిషం’ (minute) నిబంధన ఉండనే ఉంది. మెదక్ జిల్లాలో ఓ విద్యార్థిని సమస్యను అధికారులు పట్టించుకోలేదు. దీంతో తండ్రి ఎగ్జామ్ సెంటర్‌లోనికి తన కూతురిని ఎత్తుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మెదక్‌కు (medak) చెందిన ఇంటర్ విద్యార్థిని శ్రీ వర్షకు (sri varsha) ఇటీవల కాలు విరిగింది. బుధవారం పరీక్షలు ప్రారంభం కావడంతో తండ్రి వెంకటేశంతో (venkatesham) కలిసి టీఎస్ఎస్ ఆర్డబ్ల్యూజేసీ సెంటర్‌కు చేరుకుంది. గేటు నుంచి హాల్ (hall) వరకు చాలా దూరం ఉంది. తన కూతురు (daughter) నడవలేదని.. వీల్ చెయిర్ ఏర్పాటు చేయాలని ఎగ్జామినేషన్ సెంటర్ (examination centre) నిర్వాహకులను వెంకటేశం (venkatesham) కోరాడు. వారు ఎవరూ పట్టించుకోలేదు.
కూతురు నడవడం వీలు లేదు. దీంతో ఆమెను భుజాలపై (shoulders) ఎత్తుకుని ఎగ్జామినేషన్ సెంటర్ వద్దకు తీసుకెళ్లాడు. తీసుకెళ్లేందుకు ముందు సెక్యూరిటీ (security) సిబ్బంది అభ్యంతరం తెలిపారు. పరిస్థితి వివరించడంతో అనుమతించారని పేర్కొన్నారు. అలా తన కూతురిని (daughter) సెంటర్ వద్దకు ఎత్తుకెళ్లానని.. సెంటర్ నిర్వాహకులు మాత్రం పట్టించుకోలేదని చెప్పాడు.
ఎగ్జామ్‌కు (exam) వచ్చే విద్యార్థులకు కనీస సౌకర్యాలతో పాటు.. వారికి ఇబ్బంది ఉంటే తీర్చాల్సిన బాధ్యత ఆ సెంటర్ నిర్వాహకులదే. లేదంటే పై అధికారులకు (officials) సమాచారం అందజేసి.. తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేయాల్సి ఉంది. పట్టనట్టు ఉండటంతో.. తండ్రి (father) చొరవ తీసుకున్నాడు. లేదంటే అతని కూతురు పరీక్ష రాసే వీలు ఉండకపోయేది. మరోవైపు నిన్న ఖమ్మం రూరల్ కొండపురానికి చెందిన వినయ్.. ఎన్ఎస్పీ ప్రభుత్వ స్కూల్లో సెంటర్ పడగా.. గుర్తించేందుకు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశాడు. అదీ తప్పుడు లొకేషన్‌కు తీసుకెళ్లడంతో సకాలంలో సెంటర్‌కు వెళ్లక.. పరీక్ష రాయలేకపోయాడు.