Road accident : నిజామాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం… ముగ్గురు మృతి
ఇందూరులో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొక్కరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
నిజామాబాద్ (Nizamabad) నగర శివారులో అర్సపల్లి బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందూరు రెంజల్ (Rangel) మండలం దూపల్లి వెళ్తున్న ఆటోను ఎదరుగా వచ్చిన అశోక లే ల్యాండ్ (Ashoka lay land) పికప్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. సంఘటన జరిగిన ప్రాంతంలో అతివేగంతో రెండు వాహనాలు ఢీకొట్టుకోగా మృతదేహాలతో పరిస్థితి భయానకంగా మారింది. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రి(hospital)కి తరలించారు. నిజామాబాద్ లో భవన నిర్మాణ పనులు చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు (police) భావిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనంలో ఉన్న వారికి పెద్ధగా గాయాలు కాలేదని తెలిసింది. సంఘటన స్థలానికి ఆరవ టౌన్ పోలీస్ లు చేరుకుని కేసు దర్యాప్తు చేసుకొని విచారణ చేపట్టారు.