PDPL: రాష్ట్రస్థాయి సీఎం కప్ ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు వరంగల్లో రిపోర్ట్ చేయాలని పెద్దపల్లి జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి సురేశ్ తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు పోటీలు జరుగుతాయన్నారు. పెద్దపల్లి జిల్లా తరఫున క్రీడాకారులకు టీషర్ట్స్, బస్సు పాసులు ఇస్తామన్నారు. వివరాలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.