WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని వెజిటేబుల్ & ఫ్రూట్స్ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. యూరియా కోసం వచ్చిన రైతులకు నిన్న టోకెన్లు ఇవ్వగా, చాలామందికి టోకెన్లు అందకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి సరిపడా యూరియా అందించాలని కోరారు.