నిజామాబాద్: నగరంలోని మాణిక్ బండార్ సమీపంలో అనుమతి లేకుండా నడుపుతున్న లండన్ కిడ్స్ పాఠశాలను సీజ్ చేయాలని AISA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న లండన్ కిట్ స్కూల్ పర్మిషన్ భవనాన్ని సీజ్ చేయాలని కోరారు.