WGL: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 12వ డివిజన్ దేశాయిపేటలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు మంత్రి కొండా సురేఖ బుధవారం భూమి పూజ చేశారు. కలెక్టర్ సత్య శారద, మున్సిపల్ కమిషనర్ చాహత్ బజ్ చాయ్ కలిసి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు.