HYD: మెట్రో రైలు ఛార్జీలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. మే రెండోవారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటి ద్వారా వార్షికంగా, అదనంగా రూ.150 కోట్ల వరకు రాబట్టుకునేలా సంస్థ కసరత్తు చేస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెట్రోలో కనిష్ఠం రూ.10, గరిష్ఠం రూ.60 ఉండగా, గరిష్ఠం రూ.75 వరకు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.