KKD: రైతులకు కూటమి ప్రభుత్వం ఆపద్బాంధవుడుగా పని చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం కంటే కూడా అదనంగా 11 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు అండగా ఈ ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందన్నారు.