E.G: పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సోమవారం పర్యటన వివరాలు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10:30కు అయినవిల్లి మండలం ఎన్. పెదపాలెంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11:30కు అంబాజీపేట మండలంలో ఇటీవల సింహాచలంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.