కోనసీమ: గ్రామాలలో రోడ్డు సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా అవకాశాలు కలుగుతాయని.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం రావులపాలెం మండలం గోపాలపురంలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డు, డ్రైన్‌ను పరిశీలించారు.