కోనసీమ: ఇటీవల పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సభ్యులుగా నియమితులైన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్‌ని రామచంద్రపురం YCP కార్యాలయం వద్ద కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.