KRNL: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆమె ప్రజలతో మమేకమయ్యేందుకు ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈనెల 11న కర్నూలులో, 12న నంద్యాలలో పర్యటనలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వైఎస్ షర్మిల పర్యటనను విజయవంతం చేయాలంది.