SKLM: వాతావరణ శాఖ అధికారులు సూచనల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి పలు సూచనలు జారీ చేశారు.