NDL: నంద్యాల పట్టణంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి NMD ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పూర్వ పితామహులకు స్వర్గప్రాప్తి కల్పించడానికి దివి నుంచి గంగను భూమిపైకి వచ్చేలా చేశారని భగీరథ మహర్షిని కొనియాడారు.