ధర్మశాల వేదికగా LSGతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 37 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 199/7 పరుగులు చేసింది. మార్క్రమ్ (13), మిచెల్ మార్ష్ (0), పూరన్ (6) తేలిపోయారు. కెప్టెన్ పంత్ (18) మరోసారి విఫలమయ్యాడు. చివర్లో బదోని (74) ఆకట్టుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3, ఒమర్జాయ్ రెండు వికెట్లు పడగొట్టారు.