SKLM: పాతపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం డీసీసీబీ ఛైర్మన్గా నియమితులైన శివాల సూర్యం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ముందుండి నడిపించిన కార్యకర్తలే అధినేతగా గుర్తించబడతారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.