జనగాం: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లా ప్రజలకు ముఖ్య సూచన చేశారు. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా వడదెబ్బ ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శరీరానికి తగినంత నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలన్నారు, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం, మధ్యాహ్న వేళలో బయటకు వెళ్లకుండా ఉండాలన్నారు.