BHPL: మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో మతిస్తిమితం లేని ఓ వ్యక్తి చిక్కులు పడిన జుట్టుతో శనివారం అందహీనంగా కనిపించాడు. దీన్ని చూసిన నాయీబ్రాహ్మణ యువకుడు నిట్టూరి రాకేశ్, అతడిని చేరదీసి క్షౌరం చేసి మానవత్వం చాటాడు. ఈ సేవా దృశ్యాన్ని చూసిన గ్రామ ప్రజలు రాకేశ్‌ను అభినందించారు. రాకేశ్ చేసిన పనికి గ్రామంలో మానవీయ విలువలను చాటిందని పలువురు కొనియాడారు.