KMM: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని AIPKMS జిల్లా అధ్యక్షుడు శివలింగం అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా కలెక్టరేట్లో డీఆర్వో పద్మజాకు వినతి పత్రం అందించారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి వ్యవసాయ కూలీలను గుర్తించి వారికి ఐడీ కార్డులు ఇవ్వాలన్నారు.