NZB: వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు గుర్తింపు కార్డు పొందడానికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని భీమగల్ మండల వ్యవసాయ శాఖ ఇన్ఛార్జ్ అధికారిణి లావణ్య తెలిపారు. రైతులు తమ పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డ్, ఆధార్ కార్డుకు లింక్ ఉన్న ఫోన్ (ఓటీపీ కొరకు) తీసుకుని వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చి రిజిస్టర్ చేయించుకోవాలని సూచించారు.