NLG: రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సమయానికి, పారదర్శకంగా అందించాలనే ఫర్టిలైజర్స్ యూరియా ఆన్ లైన్ బుకింగ్ యాప్ను ప్రారంభించినట్లు కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. రైతులకు ఇక యూరియా బాధలు రావన్నారు. నల్గొండలో ‘మన గ్రోమోర్’ కేంద్రంలో బుకింగ్ యాప్ను ఇవాళ ప్రారంభించారు. అవసరమైన యూరియాను ముందుగానే బుక్ చేసుకొని డీలర్ నుంచి పొందవచ్చని తెలిపారు.