NZB: మొన్న కురిసిన వర్షాలకు ఆర్మూర్ రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డు కొట్టుకు పోయింది. దీంతో పైపులు వేసి దానిపై మట్టి వేశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఇరువైపులా మట్టి కొట్టుకుపోయి దారి సన్నగా మారింది. దీంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాహనదారులు వాపోతున్నారు. ప్రభుత్వం మట్టి వేసి రోడ్డును పునరుద్ధరించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.