MDK: నిజాంపేటకు చెందిన అఖిల CPGET-2025 పీజీ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబర్చింది. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన MSC బోటనీ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. అఖిల 84 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. సంగారెడ్డి ప్రభుత్వ బాలికల కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ విజయంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందించారు.