KNR: కరీంనగర్ జిల్లాలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం 20 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సీపీ గౌస్ ఆలం పరేడ్ గ్రౌండ్లో ర్యాలీని ప్రారంభించారు. ప్రజల భద్రత కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు అందరికీ స్ఫూర్తి కావాలని ఆయన అన్నారు. రన్నర్స్ సైక్లిస్ట్ అసోసియేషన్ సభ్యులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.