MDK: పదిహేను రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పొలాలకు వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోవడంతో కాట్రియాల గ్రామ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న పుష్పాలవాగు ఉద్ధృతికి ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.