NZB: సీఎం కప్ క్రీడలలో భాగంగా, జిల్లా స్థాయిలో నిర్వహించిన 400 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్ సీనియర్ మహిళా విభాగంలో జంగంపల్లి గ్రామానికి చెందిన మాసుల రమ్య గోల్డ్ మెడల్ సాధించారు. అంతేగాకుండా రెండింటిలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా క్రీడలలో విశేషంగా రాణిస్తూ సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మాసుల రమ్యను గ్రామస్థులు అభినందించారు.