MBNR: యూరియా ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు వచ్చిన 600 మెట్రిక్ టన్నుల యూరియాను అన్ని ప్రాంతాలకు సరఫరా చేయాలన్నారు.