ADB: గోవింద నామస్మరణతో జిల్లాలోనే సుప్రసిద్ధ జైనథ్ శ్రీ లక్ష్మి నారాయణ స్వామి ఆలయ ప్రాంగణం మారుమోగింది. స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా సాగాయి. శ్రీమన్నారాయణుడు పంచ వాహనుడై గ్రామా వీధుల్లో ఊరేగారు. శోభాయాత్ర ఘట్టాన్ని తిలకించేందుకు వచ్చిన భక్త జనంతో గ్రామం సందడిగా మారింది.