ADB: గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ పథకాలు రద్దు చేయడం జరుగుతుందని ఇచ్చోడ సీఐ బండారి రాజు సోమవారం తెలిపారు. సిరికొండ, గుడిహత్నూరులో గంజాయి సాగు చేస్తున్న తండ్రి, కొడుకులపై కేసు నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. వారి పంటపొలాల్లో 23గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందన్నారు.